దుర్గగుడిలో మరో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

104
Bejawada Durgamma Gudi

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గగుడి ఆలయంలో గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారుల సోదాల్లో అనేక అవినీతి విషయాలు వెలుగు చూశాయి. ఏసీబీ అధికారులు నివేదిక ఆధారంగా దుర్గగుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ సస్పెన్షన్‌ను విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మాక్స్ సెక్యూరిటీకి టెండర్లు ఇవ్వడంలో ఉద్యోగుల పాత్ర ఉందని నిర్ధారించి సూపరింటెండెంట్ రవి ప్రసాద్, మరో అధికారి పద్మావతిని సస్పెండ్ చేశారు. కాగా, దుర్గగుడి అవినీతి కేసులో ఇప్పటివరకూ మొత్తం 15 మంది అధికారులపై అధికారులు వేటు వేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..