Rain Alert : మరికాసేపట్లో భారీ వర్షం, పిడుగులు

by Muthe.Rajitha |

నైరుతిరుతుపవనాలు నేటి రాత్రికి కేరళను తాకనున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

Rain Alert : మరికాసేపట్లో భారీ వర్షం, పిడుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : నైరుతిరుతుపవనాలు నేటి రాత్రికి కేరళను తాకనున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ విభాగం(HMD) అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మరికొద్ది గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని అధికారులు సూచించారు. ఈదురుగాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Next Story