- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబుల వీరంగం.. కత్తులతో దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా సత్యనారాయణపురంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సత్యనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆంజనేయులు అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా సత్యనారాయణపురంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సత్యనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆంజనేయులు అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. కాగా గతంలోనూ ఓ హత్య కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు.
Next Story






