ఒకేరోజు కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్మ.. పాఠశాల తీరే కారణమా?

by  |
ఒకేరోజు కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్మ.. పాఠశాల తీరే కారణమా?
X

దిశ, ఖమ్మం రూరల్​: కళ్లేదుటే భర్త, కుమారుడు మరణించడంతో ఓ కుటుంబం వీధిన పడింది. ఇన్నాళ్లూ కుటుంబాన్ని పోషిస్తున్న కుటుంబ పెద్ద ఒకరైతే.. మరోకరు మరో కొద్ది సంవత్సరాల్లో కుటుంబాన్ని పోషించే వారు ఒకరు. ఇద్దరు మరణించడంతో కుటుంబం రోడ్డున పడటమే కాకుండా వారిని శోకసంద్రంలోకి నెట్టిసింది వీరి ఆత్మహత్యలు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాల యాజమాన్యం నిర్వాకం వలన ఇదంతా జరిగిందని, దీనిని బయటకు పొక్కకుండా లక్షల రుపాయలను పోలీసులకు సమర్పించినట్లు వినికిడి. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన చల్లా రాంబాబు ఫ్యామిలీ జీవనోపాధి నిమిత్తం ఖమ్మం రూరల్​ మండలం పెద్దతండా టెంపుల్​ సీటిలో నివాసం ఉంటున్నారు.

రాంబాబుకు ఒక కుమార్తె, బాబు భానుప్రకాష్​లు ఉన్నారు. కుమారుడు భానుప్రకాష్​ ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో టెన్త్​​ చదువుతున్నాడు. ఈ నెల 14న తన పుట్టిరోజు వేడుకలను తన స్నేహితులతో కలిసి పాఠశాల ఆవరణలో నిర్వహించుకున్నాడు. విషయాన్ని పాఠశాల యాజమాన్యం సీసీ టీవీల ఆధారాలతో గమనించడంతో విద్యార్థి భానుప్రకాష్​ను తీవ్రంగా మందలించడంతో పాటు డిస్మిస్​ చేస్తామని హెచ్చరించడంతో బాలుని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని రిక్వెస్ట్​ చేయడంతో సస్పెండ్​ చేశారు. పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్న సరే యాజమాన్యం కనికరం లేకుండా ప్రవర్తించారు. అప్పటి నుంచి పాఠశాలకు చెందిన టీచర్లు పలుమార్లు విద్యార్థిని మానసికంగా వేధించడంతో దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భానుప్రకాష్​ 15న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో 16న తూదిశ్వాస విడిచాడు. బాలుని అంత్యక్రియలు స్వగ్రామామైన సత్తుపల్లిలో నిర్వహించారు. శనివారం తండ్రి కూడ అదే స్మశానవాటిక పరిసర ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో సత్తుపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి.

పాఠశాల నిర్వహణ తీరుపై మొదటి నుంచే అరోపణలు

స్నేహితులతో కలిసి బర్త్​డే వేడుకలు చేసుకోవడం వలనే బాలునితో పాటు, తండ్రి మరణానికి కూడా కారణమైందని చెప్పాలి. తెలిసి తెలియని వయస్సులో విద్యార్థులు తప్పు చేస్తే వారికి అర్థమయ్యే రీతిలో వారికి చెప్పాలి కానీ.. అలా కాకుండా వారిని మానసికంగా హింసించడం వలనే ఇంతటి ఘోరం జరిగిందని చెప్పాలి. పాఠశాల యామాన్యం తీరుపై మొదటి నుంచే పలు అరోపణలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో అది మరింత బలపడిందని చెప్పాలి. మరో నాలుగు నెలలైతే విద్యార్థి చదువు కూడా ముగిసేది. ఇటువంటి సమయంలో పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరు సరిగ్గాలేకపోవడంతో ఈ దుర్ఘటనలు జరిగాయి. దీనికి పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యమే వహించాల్సి వస్తుంది.

మృతికి కారణమైన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

తన భర్త, కొడుకు మృతికి కారణమైన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని భార్య అరోపించింది. ఇద్దరి మరణాలతో తమ కుటుంబం రోడ్డున పడిందని, తాము బ్రతికి ఉండి ఏం లాభం అని ప్రశ్నిస్తున్న తీరు చూస్తే కలవరపెడుతుందని చెప్పాలి. ఏదిఏమైనా సదరు పాఠశాలపై జిల్లా విద్యాశాఖ స్పందించి తగు చర్యలు తీసుకుని విద్యార్థి కుటుంబానికి తగు న్యాయం చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.



Next Story

Most Viewed