- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్..
by Shyam |
<p>దిశ, ఏటూరునాగారం: గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 72 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తాడ్వాయి పోలీసులు తెలిపారు. మంగళవారం మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీలు చేయగా గంజాయి లభ్యమైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పల్తియా తండాకు చెందిన శంకర్, వరంగల్ రూరల్ జిల్లా అశోకనగర్‌కు చెందిన బూడిద శ్రీకాంత్ […]</p>

X
దిశ, ఏటూరునాగారం: గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 72 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తాడ్వాయి పోలీసులు తెలిపారు. మంగళవారం మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీలు చేయగా గంజాయి లభ్యమైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పల్తియా తండాకు చెందిన శంకర్, వరంగల్ రూరల్ జిల్లా అశోకనగర్‌కు చెందిన బూడిద శ్రీకాంత్ చింతూరు సరిహద్దు ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






