మెసేజ్ పంచాయితీ.. తల్వార్‌తో బెదిరించిన ఇద్దరు అరెస్టు

by  |
మెసేజ్ పంచాయితీ.. తల్వార్‌తో బెదిరించిన ఇద్దరు అరెస్టు
X

దిశ‌, ఖ‌మ్మం : తల్వార్‌తో బెదిరించి దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖమ్మం టూ టౌన్ సీఐ శ్రీధర్ తెలిపారు. గత నెలలో వాట్సాప్ గ్రూపులో అసభ్యకర మెసేజ్ పెట్టిన రౌడీషీటర్ బిజిగి సాంబా అనే వ్యక్తిని అదే గ్రూప్‌లో వున్న గ్రానైట్ వ్యాపారి పెద్ది చిరంజీవి మెసేజ్ ఎందుకు పెట్టావని ప్రశ్నించాడు. దీంతో కక్ష గట్టిన సాంబా, తన ఫ్రెండ్ గంటా ప్రవీన్‌తో కలసి బైపాస్ రోడ్డులో గల గ్రానైట్ ఆఫీస్ వద్దకు వెళ్లి పెద్ది చిరంజీవి, అతని మామ పై తల్వార్‌తో దాడి చేసి చంపుతామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన పెద్ది చిరంజీవి మామ లింగబోయిన లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.

అప్పటి నుండి తప్పించుకుని తిరుగుతున్న నిందితుల‌ను రఘునాథపాలెం మండలం పాండు రంగాపురంలో గల ఇంట్లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు మంగ‌ళ‌వారం ఉద‌యం తల్వార్తో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రౌడీషీటర్ బిజీగి సాంబాపై గతంలో ఐదు కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. ఇటీవల కాలంలో యువకులు పుట్టినరోజు వేడుకల పేరుతో రోడ్లపై తల్వార్తో కేకులు కట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటో పోస్టులు పెడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. తల్వార్ ఆయుధంగా పరిగణించబడుతుందని, కావున ఆయుధ చట్టప్రకారం ఎవరైనా శిక్షార్హులు అవుతారని సీఐ శ్రీధర్ తెలిపారు.


Next Story

Most Viewed