ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు

58

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో నేడు మళ్లీ డబుల్ ధమాక ఉండనుంది. ఆదివారం సెలవు దినం సందర్భంగా క్రీడాభిమానులకు రెండు మ్యాచ్‌లతో ఎంటర్‌టైన్ కానున్నారు. అబుదాబి వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. వరుసగా ఓటమి పాలవుతున్న ఇరు జట్లు, ఈ మ్యాచ్‌ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమాన బలాలు కలిగి ఉన్నాయి.

అనంతరం రాత్రి 7:30 గంటలకు దుబాయ్ వేదికగా మరో రసవత్తర మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో ఊపుమీద ఉన్న ముంబై ఇండియన్స్‌తో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తలపడనుంది. గేల్ రాకతో చివరి మ్యాచ్‌లో నెగ్గిన పంజాబ్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. అద్భుతమైన ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న ముంబై జట్టు కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని భావిస్తోంది. మరి ఈ రెండు మ్యాచ్‌లలో ఏ జట్టుపై ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.