ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్

36

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మంగపేట అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈక్రమంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మరొకరు గాయపడినట్లు తెలుస్తోంది. భారీగా చేరుకున్న పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం మంగపేట అటవీప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.