గేదెను ఢీ కొట్టి.. ఇద్దరు మృతి

56

దిశ, పాలేరు: రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌ రోడ్డు వద్ద జరిగింది. ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న డీసీఏం‌ రోడ్డు మీద అడ్డంగా వెళ్తున్న గేదెన మీదకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌, మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌లో మృతులు, క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..