- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు మృతి..
by Batti.Sumithra |
<p>దిశ, నర్సంపేట : వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం… వరంగల్ లోని గొర్రెకుంట, కీర్తినగర్ కి చెందిన ఐదుగురు వ్యక్తులు గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలోని ఓ పెళ్లికి హాజరయ్యారు. కొమ్మాల గ్రామం నుండి సాయంత్రం గిర్నిబావి గ్రామానికి వెళ్లి తిరిగి కొమ్మాల ఆలయం వైపు బయలు దేరారు. సరిగ్గా రత్తిరామ్ తండా […]</p>

X
దిశ, నర్సంపేట : వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం… వరంగల్ లోని గొర్రెకుంట, కీర్తినగర్ కి చెందిన ఐదుగురు వ్యక్తులు గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలోని ఓ పెళ్లికి హాజరయ్యారు. కొమ్మాల గ్రామం నుండి సాయంత్రం గిర్నిబావి గ్రామానికి వెళ్లి తిరిగి కొమ్మాల ఆలయం వైపు బయలు దేరారు. సరిగ్గా రత్తిరామ్ తండా దగ్గరికి వచ్చేసరికి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలి లోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రుల్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Next Story






