అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

by  |
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. సీపీ సజ్జనార్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీవనోపాథి నిమిత్తం షేక్ సాబెర్… గుల్భార్గా నుంచి 2007లో తాండూరుకు వలస రాగా సొంతూరుకు వెళ్లొచ్చే క్రమంలో కర్నాటకలోని రైల్వే స్టేషన్లలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. 2015లో గుల్భార్గ సెంట్రల్ జైలులో సాబెర్‌కు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడే పటాన్ చాంద్ పాషా పరిచయం కాగా ఇద్దరు కలిసి దొంగతనాలకు చేయాలని ప్లాన్ వేశారు.

తాండూరులో సాబెర్ ఆశ్రయం కల్పించగా, పటాన్ చాంద్ పాషా ఇళ్లల్లో దొంగతనాలు చేసేందుకు సామాగ్రిని సమకూర్చాడు. ఇద్దరు కలిసి ఈ ఏడాది మార్చి 9నుంచి జూలై 14వరకు మొయినాబాద్‌లో రెండు, కొందుర్గులో రెండు వికారాబాద్ జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో రెండు, మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు, నారాయణపేట జిల్లాలో ఓ దొంగతనానికి పాల్పడగా కేసులు నమోదయ్యాయి. సీసీ ఫుటేజీ పరిశీలించిన శంషాబాద్ సీసీఎస్ పోలీసులు సాబెర్, పటాన్ చాంద్ పాషాలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 325 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలోవెండి, రూ.6.70లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కేపీహెచ్‌బీలో ఇద్దరు అరెస్ట్

కేపీహెచ్‌బీతో పాటు బాచుపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, ఆర్సీపురం, రాయదుర్గం, చందానగర్‌, బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆవుల కిరణ్ కుమార్, ఎం.శ్రీనివాస్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16.70 లక్షల విలువైన 30తులాల బంగారం, 829 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.


Next Story