ఇద్దరి రైతుల ఆత్మహత్య.. కారణం ఇదే

by Batti.Sumithra |

<p>దిశ, మునుగోడు: సూర్యాపేట జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక ఇద్దరు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలలో ఆరుట్ల సోమయ్య(45) మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. మరో ఘటన జనగాం గ్రామంలో చోటుచేసుకుంది. సుక్క యాదయ్య(50) తన వ్యవసాయ భూమిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణపురం ఎస్సై నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం [&hellip;]</p>

ఇద్దరి రైతుల ఆత్మహత్య.. కారణం ఇదే
X

దిశ, మునుగోడు: సూర్యాపేట జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక ఇద్దరు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలలో ఆరుట్ల సోమయ్య(45) మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. మరో ఘటన జనగాం గ్రామంలో చోటుచేసుకుంది. సుక్క యాదయ్య(50) తన వ్యవసాయ భూమిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణపురం ఎస్సై నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story