- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భూమి మాది అంటే మాది.. కుటుంబంపై కర్రలతో దాడి
<p>దిశ, ముధోల్ : ముధోల్ మండలం ఎడ్ బీడ్ గ్రామానికి చెందిన సాయన్న అనే వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి కొంత భూమి వచ్చిందని సమాచారం. అయితే, అదే గ్రామానికి చెందిన రావుల చిన్నసాయ రెడ్డి అనే వ్యక్తి ఆ భూమికి తమదని, దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంపై ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. శనివారం ఉదయం ఈ భూమి పంచాయితీ […]</p>

దిశ, ముధోల్ : ముధోల్ మండలం ఎడ్ బీడ్ గ్రామానికి చెందిన సాయన్న అనే వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి కొంత భూమి వచ్చిందని సమాచారం. అయితే, అదే గ్రామానికి చెందిన రావుల చిన్నసాయ రెడ్డి అనే వ్యక్తి ఆ భూమికి తమదని, దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని ఆరోపించారు.
ఈ విషయంపై ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. శనివారం ఉదయం ఈ భూమి పంచాయితీ విషయమై చిన్నసాయ రెడ్డి , అతని కొడుకు క్రిష్ణా రెడ్డి ఇంకా వారి బలగం కొందరు కలిసి సాయన్న కుటుంబ సభ్యులపై దాడి దిగారు. అడ్డం వచ్చిన సాయన్న కూతురు స్వప్న, తోబుట్టవు సైతం వీరి చేతిలో దెబ్బలు తిన్నారు. గాయాలపాలైన వారిని గ్రామస్తులు అంబులెన్సులో బైంసాలోని పట్టణ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధిత కుటుంబసభ్యులు ఇట్టి విషయంలో పట్టణ డీఎస్పీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.






