- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాగర్ రోడ్‌లో లారీ బీభత్సం.. ఇద్దరు స్టూడెంట్స్ స్పాట్ డెడ్
by Batti.Sumithra |
<p>దిశ, వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో బోర్‌వెల్ లారీ బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం సాగర్ కాంప్లెక్స్ వద్ద బైకుపై వెళ్తోన్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో విద్యార్థులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతులు ఏవీఎన్ […]</p>

X
దిశ, వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో బోర్‌వెల్ లారీ బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం సాగర్ కాంప్లెక్స్ వద్ద బైకుపై వెళ్తోన్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో విద్యార్థులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతులు ఏవీఎన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా గర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






