- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడి వెనకాల చెరువులో ఇద్దరు డాక్టర్లు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, మేడ్చల్ జిల్లా: చెరువులో ఇద్దరు డాక్టర్లు గల్లంతు అయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో వెలుగుచూసింది. అల్వాల్‌లోని ఓ హోమియోపతి హాస్పిటల్‌లో డాక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు శామీర్‌పేటలోని కట్టమైసమ్మ ఆలయం వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే గుడి వెనకాలే ఉన్న చెరువును వీక్షించేందుకు చెరువుగట్టుపై బైక్, బ్యాగులు, సెల్‌ఫోన్లు వదిలి.. నీటిలో దిగారు. ఈ క్రమంలో చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో గల్లంతు అయ్యారు. సమాచారం […]</p>

X
దిశ, మేడ్చల్ జిల్లా: చెరువులో ఇద్దరు డాక్టర్లు గల్లంతు అయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో వెలుగుచూసింది. అల్వాల్‌లోని ఓ హోమియోపతి హాస్పిటల్‌లో డాక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు శామీర్‌పేటలోని కట్టమైసమ్మ ఆలయం వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే గుడి వెనకాలే ఉన్న చెరువును వీక్షించేందుకు చెరువుగట్టుపై బైక్, బ్యాగులు, సెల్‌ఫోన్లు వదిలి.. నీటిలో దిగారు. ఈ క్రమంలో చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గల్లంతైన వైద్యుల కుటుంబీకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






