ఘోర ప్రమాదం: యువకులు దుర్మరణం

35

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. డుంబ్రిగూడ మండలం బురదగెడ్డ సమీపంలో ఆటో, బైక్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో చంద్ర, అశోక్‌ అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.