కారు బోల్తా… అత్త, అల్లుడు మృతి 

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: అవనిగడ్డ మండలంలోని దేచవరం మిద్దె సమీపంలో కారు బోల్తా పడి ఇరువురు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం&#8230; అడిగొప్పల గ్రామానికి చెందిన నాలి నాగేశ్వరరావు తన భార్య, పిల్లలు, అత్తతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దేచవరం మిద్దె సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలి నాగేశ్వరరావు [&hellip;]</p>

కారు బోల్తా… అత్త, అల్లుడు మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: అవనిగడ్డ మండలంలోని దేచవరం మిద్దె సమీపంలో కారు బోల్తా పడి ఇరువురు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడిగొప్పల గ్రామానికి చెందిన నాలి నాగేశ్వరరావు తన భార్య, పిల్లలు, అత్తతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో దేచవరం మిద్దె సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలి నాగేశ్వరరావు (35), అతని అత్త మారెబోయిన మంగమ్మ(53) మృతి చెందారు. వెంటనే దేచవరం గ్రామస్తులు కారులో ఉన్న వారిని బయటికి తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్సై ఉదయ బాబు సకాలంలో స్పందించి క్షతగాత్రులను తన వాహనంలో నరసరావుపేటలోని వైద్యశాలకు తరలించారు.

Next Story