- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ఆత్మహత్య..
<p>దిశ, సంగారెడ్డి: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి లో చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం గండి గూడెం (కలబ్ గూర్) గ్రామానికి చెందిన బోడ లక్ష్మయ్య(50), చాపల వెంకటేష్(45)లు ఇద్దరు కలిసి చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటలకు ఇద్దరు కలిసి […]</p>

దిశ, సంగారెడ్డి: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి లో చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం గండి గూడెం (కలబ్ గూర్) గ్రామానికి చెందిన బోడ లక్ష్మయ్య(50), చాపల వెంకటేష్(45)లు ఇద్దరు కలిసి చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటలకు ఇద్దరు కలిసి సంగారెడ్డికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళ లేదు. ఇద్దరి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారి జాడ తెలియలేదు. బుధవారం ఉదయం బోడ లక్ష్మయ్య, చాపల వెంకటేష్‌లు సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి చనిపోయారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ తెలిపారు.






