సామ్యూల్ కోసం రెండు క్లబ్స్ పోటీ

by  |
సామ్యూల్ కోసం రెండు క్లబ్స్ పోటీ
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభం అవగానే ఆటగాళ్ల కొనుగోళ్లు, బదిలీలు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బార్సెలోనా ఎఫ్‌సీకి ఆడుతున్న ఫ్రాన్స్ జాతీయ ఫుట్‌బాలర్ సామ్యూల్ ఉమ్‌టిటీ కోసం రెండు క్లబ్స్ పోటీ పడుతున్నాయి. ఈ సీజన్‌లో తమ క్లబ్స్ తరపున ఆడించాలని ఆసక్తిగా ఉన్నాయి. ప్రీమియర్ లీగ్‌లో పాపులర్ క్లబ్స్ అయిన మాంచెస్టర్ యునైటెడ్, ఆర్సెనల్ జట్లు సామ్యూల్‌ను తీసుకోవాలని అనుకుంటున్నాయి. మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు ప్రస్తుతం ఒక సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడి అవసరం ఉంది. సామ్యూల్ ఒక టాప్ గ్రేడ్ సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడు. ఇప్పటికే తమ స్వంత జట్లను వదలి వెళ్లిన ఇవాన్, లూయిస్, విడల్, ఆర్థర్ వంటి ఆటగాళ్ల లాగ సామ్యుల్ కూడా కొత్త క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. అయితే అతను ఏ క్లబ్‌లోచేరుతున్నాడనే విషయాన్ని ఈ 26 ఏళ్ల సామ్యుల్ అధికారికంగా వెల్లడించలేదు.



Next Story