- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలం పోచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. మృతుల్లో చర్చి ఫాదర్ దిలీప్ కుమారుడు హనిల్ సన్ ( 4 ), మరో బాలికను జయశ్రీ అలియాస్ గ్రేసి (4)గా గుర్తించారు. చర్చి నిర్మాణం కోసం పునాదులు తీయగా, ఇటీవల కురిసిన వర్షానికి గుంతలు […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలం పోచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. మృతుల్లో చర్చి ఫాదర్ దిలీప్ కుమారుడు హనిల్ సన్ ( 4 ), మరో బాలికను జయశ్రీ అలియాస్ గ్రేసి (4)గా గుర్తించారు. చర్చి నిర్మాణం కోసం పునాదులు తీయగా, ఇటీవల కురిసిన వర్షానికి గుంతలు మొత్తం నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలోనే అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. చిన్నారుల మృతి రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ మేరకు నాగిరెడ్డి పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story






