హయత్‌‌నగర్‌ చిన్నారులు సేఫ్ !

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: వారంరోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల ఘటన సుఖాంతమైంది. కుంట్లూరుకు చెందిన యాడపల్లి సౌమ్య, ఆనంద్‌కుమార్ దంపతులు కొద్దిరోజులుగా వేర్వురుగా ఉంటున్నారు. సౌమ్య హయత్‌నగర్‌లో పిల్లలు ప్రేమ(11), శ్రీపాల్ (13)తో కలిసి ఉంటుండగా తండ్రి ఆనంద్‌కుమార్ మహబూబాబాద్‌లో ఉంటున్నాడు. ఇదేక్రమంలో గురువారం రాత్రి భోజనం చేశాక తల్లీపిల్లలు ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 8గంటలకు లేచి చూసే సరికి పిల్లలు లేకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి [&hellip;]</p>

హయత్‌‌నగర్‌ చిన్నారులు సేఫ్ !
X

దిశ, వెబ్‌డెస్క్: వారంరోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల ఘటన సుఖాంతమైంది. కుంట్లూరుకు చెందిన యాడపల్లి సౌమ్య, ఆనంద్‌కుమార్ దంపతులు కొద్దిరోజులుగా వేర్వురుగా ఉంటున్నారు. సౌమ్య హయత్‌నగర్‌లో పిల్లలు ప్రేమ(11), శ్రీపాల్ (13)తో కలిసి ఉంటుండగా తండ్రి ఆనంద్‌కుమార్ మహబూబాబాద్‌లో ఉంటున్నాడు. ఇదేక్రమంలో గురువారం రాత్రి భోజనం చేశాక తల్లీపిల్లలు ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 8గంటలకు లేచి చూసే సరికి పిల్లలు లేకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులు.. బుధవారం మహబూబాబాద్‌లోని తండ్రి వద్ద ఉన్న ఇద్దరు పిల్లలను పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు.

Next Story