ఏపీలో విషాదం : భవనం కూలి ఇద్దరు చిన్నారులు మృతి

385

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గత రెండు రోజుల నుంచి ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ తిరుచానూరు, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో వరద తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలోని కదిరి పాత చైర్మన్ వీధిలో రెండు భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

నాలుగు అంతస్తుల భవనం కూలి రెండు అంతస్థుల భవనం పై పడింది. దీంతో రెండు భవనాలు కుప్పకూలాయి. అయితే ఈ రెండు భవనాలు కూలిన సమయంలో, పదకొండు మంది అందులోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు  ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.  సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.