- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు పిల్లలను బలిగొన్న సంపు
by Batti.Sumithra |
<p>దిశ, సంగారెడ్డి: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పొలంలోని సంపులో ఈత కొడుతూ ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన ఝరాసంగంలో చోటుచేసుకుంది. మేతరి విశాల్ బాబు(11), హర్షవర్ధన్ (10) ఇద్దరు పిల్లలు పొట్టిపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో సంపులో ఈత కొడుతూ.. ప్రమాదవశాత్తు మృతి చెందారు. విశాల్ బాబు తండ్రి విజేందర్, తల్లి బాలమణిలు అనారోగ్యంతో మూడు ఏళ్ల క్రితం మృతి చెందారు. హర్షవర్ధన్ తండ్రి రాజు కూడా గత నాలుగు సంవత్సరాల […]</p>

X
దిశ, సంగారెడ్డి: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పొలంలోని సంపులో ఈత కొడుతూ ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన ఝరాసంగంలో చోటుచేసుకుంది. మేతరి విశాల్ బాబు(11), హర్షవర్ధన్ (10) ఇద్దరు పిల్లలు పొట్టిపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో సంపులో ఈత కొడుతూ.. ప్రమాదవశాత్తు మృతి చెందారు. విశాల్ బాబు తండ్రి విజేందర్, తల్లి బాలమణిలు అనారోగ్యంతో మూడు ఏళ్ల క్రితం మృతి చెందారు. హర్షవర్ధన్ తండ్రి రాజు కూడా గత నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురై మరణించారు. ఈ ఇద్దరి పిల్లలను మేనమామ విద్యాసాగర్ పెంచుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story






