అదుపు తప్పిన ఆర్ఎంసి వాహనం రెండు కార్లు ధ్వంసం

by  |
అదుపు తప్పిన ఆర్ఎంసి వాహనం రెండు కార్లు ధ్వంసం
X

దిశ, కూకట్ పల్లి: కెపిహెచ్‌బీ కాలనీ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తున్న అన్నపూర్ణ ఆర్ఎంసి (రెడీ మిక్స్) వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న రెండు కార్ల ను ఢీ కొట్టి రోడ్డు పై బోల్తా పడింది. దీంతో హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వైపు, జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచి పోయాయి. ఇంజిన్ లో సమస్య రావడం‌తో ఆర్ఎంసి లారీ డ్రైవర్ దానిని అదుపు చేయలేక పోవడం‌తో ప్రమాదం చోటు చేసుకుందని ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ తెలిపారు. రోడ్డుపై అడ్డంగా పాడిన ఆర్ఎంసి వాహనాన్ని తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed