- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుదాఘాతంతో సోదరులు బలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: అనంతపురం జిల్లా ఉరవకొండలోని బాలాజీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న రమేశ్, మల్లేశ్ అనే ఇద్దరు సోదరులు మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. వేకువజామున బహిర్భూమికి వెళ్లిన సోదరులు నీటి ట్యాంక్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తాకారు. దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎంతసేపటికీ కుమారులు రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాలతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే […]</p>

X
దిశ, అమరావతి: అనంతపురం జిల్లా ఉరవకొండలోని బాలాజీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న రమేశ్, మల్లేశ్ అనే ఇద్దరు సోదరులు మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. వేకువజామున బహిర్భూమికి వెళ్లిన సోదరులు నీటి ట్యాంక్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తాకారు. దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎంతసేపటికీ కుమారులు రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాలతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని బంధువులకు నచ్చజెప్పి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Next Story






