- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ గుట్టపై రెండు మృతదేహాలు లభ్యం
<p>దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో శివలింగ గుట్టపై రెండు కుళ్ళిపోయిన మృతదేహాలను సీఐ వెంకటేశ్వర్లు గుర్తించారు. మంగళవారం ఉదయం జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో గల శివలింగ గుట్టపై ఉన్న శివాలయాన్ని దర్శనం తీసుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయం చుట్టుపక్కల దుర్వాసన రావడంతో రెండు మృతదేహాలు కుళ్లిపోయి పడి ఉండటాన్ని గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ః వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ సాయి రెడ్డిలు కేసు […]</p>

దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో శివలింగ గుట్టపై రెండు కుళ్ళిపోయిన మృతదేహాలను సీఐ వెంకటేశ్వర్లు గుర్తించారు. మంగళవారం ఉదయం జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో గల శివలింగ గుట్టపై ఉన్న శివాలయాన్ని దర్శనం తీసుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయం చుట్టుపక్కల దుర్వాసన రావడంతో రెండు మృతదేహాలు కుళ్లిపోయి పడి ఉండటాన్ని గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ః
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ సాయి రెడ్డిలు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వయసు (45) నుంచి (48 )మధ్యలో ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. చనిపోయిన వ్యక్తులు భార్యభర్తలా?, హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ప్రాథమికంగా శవ పరీక్ష నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశామని పేర్కొన్నారు.






