ఇద్దరికీ పెళ్లైంది కానీ.. చివరకు రిజర్వాయర్ లో అలా..

126

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లోని పోచారం ప్రాజెక్ట్ లో దూకి ఇద్ధరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. అయితే ఈ ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని సమాచారం. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇవాళ ప్రాజెక్టులో రెండు మృత దేహలు కూల్లిపోయిన స్థితిలో కనిపించాయి. మృతులు ఇద్దరిది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షట్పల్లి సంగారెడ్డి గ్రామం. షట్పల్లి సంగారెడ్డికి చెందిన కత్తుల సంతోష్ ( 32), మాలపాడు కు చెందిన దారబోయిన రాణమ్మ(28) గా గ్రామస్థులుగా గుర్తించారు. ఇంతకు ముందే వీరిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది.

కత్తుల సంతోష్ వ్యవసాయం చేసుకునే వాడు. రాణమ్మ ఇంటిదగ్గరే ఉండేదని అని స్థానికులు తెలిపారు. ఇద్ధరి మధ్య వివాహేతర సంబంధం ఉండటంతో రెండు కుటుంబాల్లో నిత్యం గోడవలు జరగుతున్నట్టు తెలిసింది. దానితోనే వారు మూడు రోజుల క్రితం వెళ్లిపోయి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. కత్తుల సంతోష్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉండగా, రాణమ్మ కు భర్త ఇద్ధరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు స్థానిక పోలిస్ స్టేషన్ లో అనుమానస్పద మరణాలుగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..