- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి
<p>దిశ, సత్తుపల్లి: మండల పరిధిలోని కిష్టారం ఓసీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిళ్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృత్యువాతకు గురైన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన కువ్వారపు శ్రీను (30), కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడుకు చెందిన తాళ్లూరి గురవయ్య (28) ఈ ప్రమాదంలో మరణించారు. బోరువెల్స్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కువ్వారపు శ్రీను కిష్టారంలో బోరు […]</p>

దిశ, సత్తుపల్లి: మండల పరిధిలోని కిష్టారం ఓసీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిళ్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృత్యువాతకు గురైన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన కువ్వారపు శ్రీను (30), కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడుకు చెందిన తాళ్లూరి గురవయ్య (28) ఈ ప్రమాదంలో మరణించారు. బోరువెల్స్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కువ్వారపు శ్రీను కిష్టారంలో బోరు పనులు ముగించుకొని నాచారం బయలుదేరాడు.
గురవయ్య సత్తుపల్లిలోని గాంధీనగర్ వచ్చి భార్య, పిల్లలను చూసుకొని కోకిలంపాడుకు తిరుగు ప్రయాణమయ్యాడు. వీరిద్దరి మోటారు సైకిళ్లు ఎదురుగా ఢీకొనడంతో గురవయ్య ఘటనా స్థలంలో చనిపోగా కొన ఊపిరితో ఉన్న శ్రీనుని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచాడు. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు, గురవయ్యకు భార్య, కుమారుడు లు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్, సీ.ఐ రమాకాంత్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






