లోన్‌ యాప్‌ల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

97

దిశ, వెబ్‌డెస్క్: లోన్‌ యాప్‌ల కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయి కేంద్రంగా లోన్‌ యాప్‌లను నిర్వహిస్తున్న చైనా, భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ సైబర్‌ క్రైమ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాంక్ ఖాతాల్లోని రూ.28కోట్లను స్తంభింపజేశారు. లోన్‌ యాప్‌ల వేధింపులు తాళలేక పలువురు యువతి, యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు.. యాప్‌లు నడిపిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు.