ఎస్ఐల దొంగతనం కేసులో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన ఇల్లంతకుంట ఎస్‌హెచ్‌ఓ

by  |
ఎస్ఐల దొంగతనం కేసులో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన ఇల్లంతకుంట ఎస్‌హెచ్‌ఓ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బెంద్రెం తిరుపతి రెడ్డికి చెందిన పర్సనల్ బాండ్ పేపర్, అఫడవిట్‌ను పోలీసులు దొంగలించారని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అంతా ఫేక్ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఇప్పటికే 15 కేసులు నమోదై ఉన్నాయని, ఏప్రిల్ 19న ఇల్లంతకుంట పీఎస్‌లో దాడి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.

నాడు కోర్టులో సమర్పించిన బాండ్ నిబంధనలకు విరుద్ధంగా జులై 16న తిరిగి నేరాలకు పాల్పడ్డందున తిరుపతిరెడ్డిపై రెండు కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో తిరుపతి రెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా సిరిసిల్ల కోర్టు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించిందని వివరించారు. కేవలం తమను జైలుకు పంపించారు అన్న కోపంతో పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఇల్లంతకుంట ఎస్‌హెచ్‌ఓ స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసుల ప్రతిష్టకు భంగం కతలించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story