- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ గొంతు కోసిన కేసులో ట్విస్ట్: గొంతు కోసారా.. కోసుకుందా..?
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీకి చెందిన నిషాక్ ఫిర్దోస్ గొంతు కోసి గుర్తు తెలియని వ్యక్తి పారిపోయారన్న కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆస్పత్రి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు వెంటనే మహిళ ఇంటి వద్ద కూడా విచారణ చేపట్టారు. డాగ్ స్క్వార్డ్ ను రప్పించి తనిఖీలు చేపట్టగా ఆ కాలనీలో కొద్దిదూరం వరకే డాగ్ వెళ్లి […]</p>

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీకి చెందిన నిషాక్ ఫిర్దోస్ గొంతు కోసి గుర్తు తెలియని వ్యక్తి పారిపోయారన్న కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆస్పత్రి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు వెంటనే మహిళ ఇంటి వద్ద కూడా విచారణ చేపట్టారు. డాగ్ స్క్వార్డ్ ను రప్పించి తనిఖీలు చేపట్టగా ఆ కాలనీలో కొద్దిదూరం వరకే డాగ్ వెళ్లి తిరిగి వచ్చింది.
ఇంటి ముందు డ్రైనేజీలో ఓ బ్లేడ్ కనిపించడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు బాధిత మహిళ తనకు తానే గొంతు కోసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. గత రెండు నెలల క్రితం సదరు మహిళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలుస్తోంది. ప్రస్తుతం అదే తరహాలో గొంతు కోసుకుని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పారిపోయినట్టుగా సృష్టించినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాయంత్రంలోపు పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.






