‘ట్వింకిల్ బాంబ్’.. ట్రోల్స్‌పై అక్షయ్ వైఫ్‌ కౌంటర్

by  |
‘ట్వింకిల్ బాంబ్’.. ట్రోల్స్‌పై అక్షయ్ వైఫ్‌ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: సెలెబ్రిటీలపై ట్రోల్స్ కామన్ అయిపోయాయి. స్టార్లు సైతం ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూ సమాధానమివ్వడం కూడా కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ సతీమణి, ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.. సరైన రీతిలో స్పందించి తనపై వచ్చిన ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చింది. అక్షయ్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమా నవంబర్ 9న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హిందూ దేవతను అగౌరవపరుస్తున్నారని, హిందువుల మనోభావాలను కించపరిచారని ఓ వర్గం మండిపడింది. అంతటితో ఆగకుండా అక్షయ్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా ఫొటో మార్ఫ్ చేసి, ట్వింకిల్ బాంబ్ అనే టైటిల్‌తో తనను ట్యాగ్ చేసిన ట్రోలర్స్ థర్డ్ క్లాస్ పర్సన్.. దేవుడిపై జోకులు చేస్తూ ఎగతాళి చేస్తారా? అని పోస్ట్ పెట్టారు.

నీలిరంగు బాడీ, పెద్ద బొట్టుతో ఉన్న ఈ ఫొటోపై స్పందించిన ట్వింకిల్.. ఒక మంచి ఫొటో కోసం వెతుకుతున్న సమయంలో ఈ పిక్ కనపడింది. సమాధానం ఇవ్వాలనే నిశ్చయించుకున్నాను. అవును.. దేవుడికి జోకులంటే చాలా ఇష్టం.. అందుకే నీలాంటి వాళ్లను సృష్టించారు’ అని కౌంటర్ ఇచ్చింది. న్యూ స్కిన్ టోన్, పెద్ద బొట్టుతో దివాళీకి టపాసులా రెడీ అవుతానని చెప్పింది ట్వింకిల్.


Next Story

Most Viewed