సరికొత్త టీవీఎస్ అపాచీ బైక్ వచ్చేసింది!

by  |
సరికొత్త టీవీఎస్ అపాచీ బైక్ వచ్చేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 4వీ బైకును బుధవారం విడుదల చేసింది. బైక్ రైడింగ్‌ను ప్రేమించే కస్టమర్లకు కొత్త టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్‌తో మెరుగైన రేసింగ్ అనుభూతి ఈ బైక్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త బైక్ రెండు వేరియంట్‌లలో లభించనుంది. డిస్క్ వేరియంట్ ధరను రూ. 1,10,320(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ), డ్రమ్ వేరియంట్‌ను రూ. 1,07,270గా నిర్ణయించిన కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మెటాలిక్ బ్లూ, నైట్ బ్లాక్, రేసింగ్ రెడ్‌తో మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ-2021లో 4-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉందని, 159.8 సీసీ సింగిల్ సిలిండర్ ఉందని, ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో అత్యంత శక్తివంతమైన రైడింగ్ ఫీల్ అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉందని, పాత అపాచీ బైక్ కంటే రెండు కిలోల తక్కువ బరువుతో ఈ కొత్త బైక్ వస్తోందని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed