13 ఏళ్ళ విద్యార్థితో టీచర్ పెళ్లి… 7 రోజులకే షాకింగ్ ట్విస్ట్

by  |
13 ఏళ్ళ విద్యార్థితో టీచర్ పెళ్లి… 7 రోజులకే షాకింగ్ ట్విస్ట్
X

దిశ,వెబ్ డెస్క్:భారత దేశం అంటే ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాగే మూఢనమ్మకాలకు, జాతకాలకు కూడా మన దేశమే హైలైట్ గా నిలుస్తుంది. పెళ్ళికి జాతకాలు కలవకపోతే వధూవరులు సంతోషంగా ఉండరని, అమ్మాయికి మాంగళ్య దోషం ఉంటే పెళ్లి కాదని,మర్రి చెట్టుకు, రావి చెట్టుకు కలిసి పెళ్లి చేస్తే త్వరగా పెళ్లవుతుందని.. ఇలాంటి నమ్మకాలు మన దేశంలో ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటి దోషాలు పోవడానికి పెద్దలు చేసే హంగామా మాములుగా ఉండదు. హోమాలు, పూజలు లాంటివి చేసి దోషం పోయిందని నమ్ముతుంటారు. తాజాగా ఒక ట్యూషన్ టీచర్ తనకున్న మాంగళ్య దోషం పోవడానికి తన దగ్గర చదువుకుంటున్న 13 ఏళ్ళ బాలుడిని పెళ్లి చేసుకుంది. ఈ విచిత్ర ఘటన పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో వెలుగుచూసింది.

బస్తీ బావా ఖేల్ ప్రాంతంలోని ఒక ట్యూషన్ టీచర్ కి మాంగళ్య దోషం వలన వివాహం జరగడం లేదు. అయితే ఆ దోషం పోవాలంటే ఆమె ముందుగా ఒక మైనర్ బాలుడిని పెళ్లి చేసుకోవాలని పూజారి సూచించాడు. దీంతో ఆ యువతీ తన దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే 13 ఏళ్ళ స్టూడెంట్ ని పెళ్లిచేసుకోవడానికి సిద్దమయ్యింది. క్లాసులు చెప్తానంటూ విద్యార్థి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి విద్యార్థిని 7 రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచేలా చేసి.. ఆ బాలుడిని వివాహమాడింది.

అనంతరం భర్త చనిపోయినట్లు గాజులు పగలకొట్టి వితంతువుగా మారింది. అంతేకాకుండా భర్త చనిపోయాక ఏర్పాటు చేసే సంతాప సభను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బాలుడిని ఇంటికి పంపించింది. ఇంటికి వచ్చిన బాలుడు మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. యువతి కుటుంబ సభ్యులు బలవంతంగా తన కుమారుడితో వివాహ కార్యక్రమాలను నిర్వహించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed