నెట్‌ఫ్లిక్స్‌లో ‘తుగ్లక్’.. ప్రైమ్‌లో ‘జగదీశ్’

by  |

దిశ, సినిమా : విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా అప్‌కమింగ్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’ టెలివిజన్‌లో ప్రీమియర్ అవుతుందా లేక నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందా? అనే ఊహాగానాలకు తెరపడింది. ఈ నెల 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు విజయ్ చేతిలో భూతద్దం పట్టుకుని తీక్షణంగా చూస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. ఆగస్టు 31 కోసం వెయిట్ చేస్తున్నామనే క్యాప్షన్ యాడ్ చేసింది.

https://twitter.com/Netflix_INSouth/status/1431127299831726081?s=20

మరోపైపు నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘టక్ జగదీశ్’ సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఇంతకుముందు నానితో ‘నిన్ను కోరి’ వంటి బ్రేకప్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన శివ నిర్వాణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ నెలకొంది. థమన్ మ్యూజిక్ అందించిన చిత్రంలో జగ్గూభాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Next Story

Most Viewed