ఈ రాశి వారికి తోడబుట్టిన వారితో సమస్యలు

348
Panchangam

తేది : 14, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(నిన్న సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 11 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(నిన్న ఉదయం 8 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 5 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 13 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 16 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 49 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 20 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 19 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 33 ని॥ వరకు) రాహుకాలం

మేష రాశి: అతిధుల రాక ఆనందం ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో కొత్త విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు. ధన లాభం ఉంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలను మొదలుపెడతారు. ఇతరులకు కావలసినంత మేర సహాయం చేయండి కానీ వారి పర్సనల్ వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఈ రాశి స్త్రీలకు శ్రమకు తగిన విధంగా రెస్ట్ తీసుకోండి.

వృషభ రాశి: ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ పరిచినా క్రమేపీ మెరుగుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పంటి నొప్పి వచ్చే అవకాశం. కావలసిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తెస్తాయి. ఉద్యోగంలో తోటి ఉద్యోగులు అన్ని విధాలుగా సహకరిస్తారు. డబ్బును కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ వ్యవహారాలలో ఇంటి పొరుగువారిని allow చేయకండి.

మిధున రాశి: ఓపిక, సహనం ఇవి మాత్రమే మీకు మంచి చేస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు విసుగు తెప్పిస్తాయి. కారణాలు చెప్పి తప్పించుకోవటం కన్నా పని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసి పై అధికారుల మెప్పు పొందండి. ఖర్చు అవసరాలు చాలా ఉన్నాయి ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టండి. మీ నోటి దురుసు తనం ఇంటిలోని పెద్దవారిని ఇబ్బంది పెట్టవచ్చు. జాగ్రత్త. అజీర్తి వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి యొక్క తప్పులను సున్నితంగా ఎత్తి చూపండి. సరిదిద్దు కుంటారు.

కర్కాటక రాశి: చాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి. మీ పిల్లల పురోగతి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. చెప్పదలుచుకున్నది అందరికీ అర్థం అయ్యేట్టు చెప్తారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. ఫిట్ నెస్ ను పూర్తిగా మెరుగు పరుచు కుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ ఆలోచనలకు అనుగుణంగా ఇంటిని మలుచుకుంటారు.

సింహరాశి: కుటుంబంలోని వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. సభలు సమావేశాలలో పాల్గొనటానికి ఆహ్వానం అందుతుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. స్థిరాస్తుల వ్యవహారాలలో సరైన తీసుకుంటారు. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైవప్రార్థన వలన పూర్తిగా మనశ్శాంతి. ఈ రాశి స్త్రీలకు కంటి సమస్యలు రాకుండా తగిన విశ్రాంతి తీసుకోండి మరియు మెడిటేషన్ చేయండి.

కన్యారాశి: మీ తోడబుట్టిన వారి వ్యవహారాల వలన కొన్ని సమస్యలు రావచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు లేవు అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. అధిక శ్రమ వలన మెడనొప్పి బాధించవచ్చు. కుటుంబ వ్యవహారాలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తీసుకొస్తాయి. వ్యాపారంలో భాగస్వాములను సంతృప్తిపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు ఎందుకూ ఉపయోగపడని పనులు చేయటం వలన మానసిక అశాంతి.

తులారాశి: ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. తోడబుట్టిన వారి నుంచి కావలసిన సహాయం అందుతుంది. నగలు మరియు ఖరీదైన ఇంటి సామాను కొనే అవకాశం. ఉద్యోగంలో మీ ప్లాన్ లను సరిగా అమలు పరచండి. అందరి ప్రశంసలు పొందుతారు. Spicy ఫుడ్ తీసుకోకండి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి ప్రేమపూర్వక ప్రవర్తన మిమ్మల్ని ఆనందాన్ని గురిచేస్తుంది.

వృశ్చిక రాశి: రావలసిన పాత బకాయిలు వసూలవుతాయి. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చే అవకాశం. అనుకున్న పనులు పూర్తి కావాలంటే దైవ సహాయం కొరకు ప్రార్థించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబంలోని ఒక వ్యక్తి గొంతెమ్మ కోరికలు కోరడం వలన మీకు మనశ్శాంతి కరువు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి డబ్బును పొదుపు చేయండి. ఉద్యోగంలో మీకు ప్రశంసలు లభిస్తాయి. అనుకున్న ధనము చేతికి అందడం వలన మీలో ఎంతో ఉత్సాహం. ఈ రాశి స్త్రీలకు మీ నిబద్ధతను కుటుంబంలో అందరూ గుర్తిస్తారు.

ధనస్సు రాశి: వ్యాపారంలో మీ ఆత్మీయుల సలహాలను పాటించండి లాభాలు పొందుతారు. అనుకున్న పనులను సకాలంలో అతిశీఘ్రంగా పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులను ప్రణాళిక ప్రకారం పెట్టండి లాభాలు వస్తాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం అదుపులో ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ కొరకు చేస్తున్న టూర్స్ భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఈ రాశి స్త్రీలు మీ జీవిత భాగస్వామికి ఒకరికి ఒకరం అంటే ఏమిటో చూపిస్తారు.

మకర రాశి: మీరు ఉత్సాహంగా ఉంటూ ఎదుటివారిని సంతోషంగా ఉంచుతారు. మీ చేతికి అందిన వన్నీ మీవే. ఉద్యోగంలో అతి శ్రమ వలన నిరాశ. పై అధికారులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. కుటుంబంలోని పెద్ద వారికి అనారోగ్యం కొరకు డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక బంధం గట్టిపడుతుంది.

కుంభరాశి: స్థిరాస్థి వ్యవహారాలలో మీకు అనుకూలం. అనేక విధాలుగా పెట్టిన పెట్టుబడుల నుంచి మీకు ధన లాభం. ఉద్యోగంలో అధిక శ్రమ. సరైన ప్రణాళిక వేసుకొని ఆఫీసులో పనులు పూర్తి చేయండి. నిరాశ వాదము, విచారం రెండు వదిలివేయండి. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ఏది ముఖ్య అవసరమో దాని కొరకే ఖర్చు పెట్టండి లేకుంటే ఇబ్బందులు. అజీర్తి సమస్య. జాగ్రత్తపడండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఇది ఒక మరపురాని రోజు.

మీన రాశి: యోగా మరియు మెడిటేషన్ మీకు అవసరం. దాని వలన మానసికంగా మరియు శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు అనుకున్న ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. భూమి కొనుగోలుకు సంబంధించి శుభవార్త అందుతుంది. కుటుంబం లోని వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. బాంధవ్యాల విలువ తెలుసుకుంటారు. వ్యాపారంలో పోటీదారులను అధిగమించటానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. మీరు పడుతున్న శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో జరుగుతున్న మంచి సంఘటనలు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి.