ఈ రాశి వారు కష్టపడండి.. దేవుడి మీద భారం వేయకండి

242
Panchangam

తేది : 10, ఆగష్టు 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 6 గం॥ 54 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 3 ని॥ వరకు)
నక్షత్రం : మఖ
(నిన్న ఉదయం 9 గం॥ 49 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 51 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 19 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 9 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 గంటలకు)

మేష రాశి: ధైర్యంతో సహనంతో సవాళ్లను ఎదుర్కోండి. విజయం సాధిస్తారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. బయట భోజనం వల్ల అజీర్తి. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే యావలో ఉన్నారు. దాని వలన తప్పులు జరుగుతాయి జాగ్రత్త. గాలిలో మేడలు కట్టకండి. మీ ఒత్తిడి చికాకు కుటుంబ సభ్యుల మీద చూపించకండి. మీ పని నిబద్ధతకు సామర్థ్యంకు ఆఫీసులో ప్రశంసలు. హోటల్ బిజినెస్ లో ఉన్న వాళ్లు మరికొంతకాలం ఆగండి లాభాల బాట పడతారు. దేవాలయ సందర్శన వలన మానసిక ప్రశాంతత. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

వృషభ రాశి: తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. మీరు చేస్తున్న ప్రయత్నాలలో అపజయం వలన అధైర్య పడకండి. దాని నుంచి పాఠం నేర్చుకోండి. ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లల చదువులను గమనించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

మిధున రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దేవాలయ సందర్శన మరియు దైవప్రార్థన వలన మానసిక బలం. ఆదాయం బాగున్నప్పటికీ అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. ఆఫీసులో మీ పని సామర్థ్యం పై అందరి ప్రశంసలు కుటుంబ వ్యవహారాల కొరకు కొంత సమయం కేటాయించండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

కర్కాటక రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం పట్టుదల అవసరం. తొందరపాటు పనికిరాదు సరైన ప్రణాళిక వేయండి. ఫిట్ నెస్ కొరకు చేసిన ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాపారంలో లాభాల కొరకు నూతన ప్రణాళికలను అమలు చేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

సింహరాశి: గందరగోళం వదిలిపెట్టండి జాగ్రత్తగా వ్యవహరించండి. పై చదువులకు విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు మరింత కష్టపడాలి టెన్షన్ పడకండి సహనంతో ఆలోచించండి. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. నూతన పెట్టుబడులపై భాగస్వాములతో చర్చించండి వీలైతే వాయిదా వేయండి. మీ పిల్లల వ్యవహారాలను చదువులను ఒక కంట గమనించండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి సమయాన్ని వృధా చేయకండి. భవిష్యత్తులో ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది వీలైతే వారికి అర్థమయ్యేటట్లు వివరించండి.

కన్య రాశి: ఇతరులతో సరైన కమ్యూనికేషన్ వలన విజయం లభిస్తుంది. వ్యాపారస్తులు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పనులలో అధిక శ్రమ. ఇవన్నీ నీటి బుడగల వంటివి కలకాలం ఉండవు. అది గమనించండి. కుటుంబంలో పెద్దవారి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. దీర్ఘకాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఈ రాశి స్త్రీల కి మీ భర్త ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

తులారాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలికి తీయండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడకండి బంధాలను తెగే వరకు లాగకండి. ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంచుకోండి సమస్యలు అవే సర్దుకుంటాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ సమస్యల గురించి చర్చించుకోండి పరిష్కరించుకోండి.

వృశ్చిక రాశి: మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. మీరు బరువు పెరుగుతున్నారు గమనించండి. ఆదాయ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో చర్చించండి ఒక అవగాహనకు రండి. కొంతమంది ఉద్యోగ మార్పుపై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులపై ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలోకి మూడవ వ్యక్తిని రానీయకండి.

ధనుస్సు రాశి: ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించకండి. సహనంతో వ్యవహరించడం వలన సరైన ఆలోచనలు వస్తాయి. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వహించకండి. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే మరింత కష్టపడాలి. పనులను ఒకదాని తర్వాత ఒకటి చేయండి గందరగోళంలో కలగాపులగం చేయకండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో పరుషంగా మాట్లాడకండి. అనుకోని ఖర్చులు ఉన్నాయి. సరైన వేళకు సరైన భోజనం చేయటం వలన ఆరోగ్యం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి: ప్రతి చిన్న విషయాన్ని నెగిటివ్ గా ఆలోచించకండి. పట్టుదల ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాల కొరకు తెలివిగా ప్రవర్తించండి లేకుంటే నష్టాలు. ఆఫీసు పనులలో అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోండి. కొంతమందికి ఆఫీస్ టూర్స్ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఫిట్ నెస్ కొరకు కష్టపడండి దేవుడి మీద భారం వేయకండి. అనుకోని అతిథి రాక వలన మీ సమయం వృధా ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు.

కుంభరాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభిస్తాయి. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఊపిరి సలపని పనులు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ పై అధికారుల గమనిస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి లేకుంటే బంధాలు తెగిపోతాయి.

మీన రాశి: అత్యుత్సాహంతో అనుకున్న కార్యాలను సులభంగా సాధిస్తారు. మీ ఉత్సాహం అంబరాన్ని అంటుతోంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆఫీసు పనులను తోటి ఉద్యోగుల సహకారంతో సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభకరం కావలసినంత ధనం చేతికందుతుంది. సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి మరికొంత దానధర్మాలకు వెచ్చించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోండి అపార్ధాలు తొలగిపోతాయి.