మంగళవారం పంచాంగం, రాశిఫలాలు (11-05-2021)

by  |
మంగళవారం పంచాంగం, రాశిఫలాలు (11-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న రాత్రి 9 గం॥ 57 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 30 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(నిన్న రాత్రి 8 గం॥ 27 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 32 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : చతుష్పాద
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 17 ని॥ నుంచి 9 గం॥ 5 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 6 గం॥ 7 ని॥ నుంచి 7 గం॥ 55 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి 9 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 11 ని॥ నుంచి 11 గం॥ 2 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ నుంచి 5 గం॥ 1 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 48 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ నుంచి 10 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : మేషము

మేష రాశి : కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూల సాధిస్తారు. గృహ సౌఖ్యం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలోని సభ్యుల ప్రవర్తన వల్ల కొంత అశాంతి. సంతానాన్ని చదువుల కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలు మాతృ వర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి రావచ్చు.

వృషభ రాశి : మీ వ్యక్తిగత రహస్యాలను ఇతరులకు చేరవేసే వ్యక్తులను గమనిస్తారు. వారిని దూరంగా ఉంచడం మంచిది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వాహనాలు ఆభరణాలు కొంటారు. ఆరోగ్యం చక్కబడుతుంది. ఈ రాశి స్త్రీలు తొందరపాటుతో తెలిసీ తెలియని ఆకర్షణలో పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

మిధున రాశి : ఇంట్లో శుభం జరుగుతుంది. పెద్దల సహకారం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. వ్యాపారంలో డబ్బు లావాదేవీలకు ఇబ్బంది లేదు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగంలో వ్యాపారంలో వేరే వారి జోక్యం వలన మోసపోయే అవకాశాన్ని అరికట్టండి. ఈ రాశి స్త్రీలకు ఓర్పు సహనము ఎంతగానో మేలు చేస్తాయని గ్రహించండి.

కర్కాటక రాశి : ఆదాయాన్ని ఖర్చులను లెక్క వేసుకోండి దుబారా ఖర్చులను అరికట్టండి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. కళ్ళు అలసటకు లోనుకాకుండా జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఓర్పు పాటించడం అవసరం.

సింహ రాశి : గతంలో కొనుగోలు చేసిన ఒక స్థిరాస్తి అమ్ముడు పోకుండా ఇబ్బంది పెడుతుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. మీ ప్రవర్తన వల్ల మీ కుటుంబ సభ్యులు వారిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకునే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మిమ్మల్ని ఆకర్షించి గుప్పెట్లో పెట్టుకోవాలని కోరుకునే వారికి తగిన సమాధానం చెబుతారు.

కన్య రాశి : ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉన్నాయి. అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి ధన సహాయం చేయడం వల్ల ఆనందం కలుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ మనోధైర్యం మిమ్మల్ని చాలా విషయాల్లో రక్షిస్తుంది.

తులా రాశి : కరోనా వలన ఎటువంటి ఇబ్బందులు లేవు. మీ స్నేహితులు వారు చేసిన రుణాలకు మీరు మధ్యవర్తి సంతకం పెట్టమని అడుగుతారు జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల ఇంతకు ముందే నిర్ణయం అయిపోయిన ప్రయాణాలు వాయిదా పడతాయి. చెడు ఆలోచన మంచిది కాదు. చేపట్టిన కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు మిమ్మల్ని భాధిస్తుంది.

వృశ్చిక రాశి : ఉద్యోగంలో పైఅధికారుల వలన కొంత ఇబ్బంది ఎదురైనా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందులు వినోదాలలో అపశృతులు మీ ప్రతిష్టను దెబ్బ తీస్తాయి. మీ తల్లిదండ్రులు డబ్బు ఖర్చు విషయంలో మీకు సలహాలను ఇస్తారు. ఈ రాశి స్త్రీలకు భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా ఆర్థిక విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం ఉంటుంది.

ధనుస్సు రాశి : ధారాళంగా డబ్బును, సమయాన్ని ఖర్చు పెట్టాలి అనుకునే మీ మనస్తత్వాన్ని కంట్రోల్ చేసుకోండి. మిత్రులు బంధువులతో ఇంతకుముందు ఉన్న వివాదాలను పరిష్కరించుకొని వారితో ఆనందంగా గడుపుతారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని విధాలుగా చెప్పినా మారని వ్యక్తుల జోలికి వెళ్లకండి. ఈ రాశి స్త్రీలకు విదేశాలలో చదువుకోవాలి అనుకున్న మీ ఆశయం నెరవేరుతుంది.

మకర రాశి : సరైన ప్రణాళికలతో వ్యాపారాన్ని నిర్వహించండి మేలు జరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ పిల్లల అభివృద్ధి మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ రాశి స్త్రీలకు కొన్ని అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి.

కుంభ రాశి : జీవితంలో ముఖ్యమైన పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. పూర్తి ఏకాగ్రతతో పని చెయ్యండి. మీ సన్నిహితులతో మీరు చర్చిద్దాం అనుకున్న విషయము వారిని బాధించవచ్చు వదిలివేయండి. భవిష్యత్తులో ప్రయోజనాల కోసం ఇప్పటినుంచి ప్రణాళికలు వేస్తారు కష్టపడతారు. ఈ రాశి స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి

మీన రాశి : ఎదుటి వ్యక్తులతో సూటిగా విషయాన్ని అర్థం అయ్యేటట్టు చెప్పండి దాటవేయ వద్దు. కుటుంబ వ్యవహారాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. ప్రతి విషయము ధనంతో ముడిపడి ఉందని గ్రహించండి. ఈ రాశి స్త్రీలకు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి అన్నివిధాల ప్రయత్నిస్తారు.


Next Story