ఈ రాశివారికి వంశ పారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తి లభిస్తుంది

616

తేది : 21, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 25 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 52 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాభద్ర (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 4 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 7 ని॥ వరకు)
యోగము : గండము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 5 ని॥ నుంచి 3 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 29 ని॥ నుంచి 9 గం॥ 17 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ నుంచి 11 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 10 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 41 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ నుంచి 10 గం॥ 37 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మీనము

మేష రాశి : ఆధ్యాత్మిక విషయాలు మీకు ఆనందాన్నిస్తాయి. ఆఫీసులో మీ పని సామర్థ్యం పట్ల అందరి ప్రశంసలు లభిస్తాయి. కొందరికి ప్రమోషన్ అవకాశం. మీ మొండితనంతో భార్యతో గొడవలు పడి తర్వాత తీరిగ్గా విచారం వ్యక్తం చేస్తారు. సహనంతో వ్యవహరించండి. కొందరు స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది. అవసరమైన ఖర్చులు చేస్తారు పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీ గొప్పతనాన్ని గుర్తించడం హాయినిస్తుంది.

వృషభ రాశి : ధన సంపాదనకు మీరు ఎంచుకున్న నూతన మార్గాలు ఎంతో సత్ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సరైన కమ్యూనికేషన్ యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తిస్తారు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం చక్కబడుతుంది. ఆఫీసులో పెండింగ్ పనుల తో సహా అన్ని పనులు పూర్తి చేస్తారు. అధిక శ్రమ వలన కంటి నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క అనారోగ్యము వలన అశాంతి.

మిధున రాశి : అనుకూలమైన రోజు. మీ కమ్యూనికేషన్ అందరి మెప్పు పొందుతుంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. మీరు వారితో గడపటం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దైవ ప్రార్థన మీకు ఎంతో బలాన్నిస్తుంది. ఇతరులను మెప్పించడం కోసం దుబారా ఖర్చు చేయకండి. ఇల్లు కొనాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీరు మీ కుటుంబాన్ని గురించి కాకుండా వేరే వారి విషయాల జోలికి వెళ్ళకండి.

కర్కాటక రాశి : దూరపు బంధువులు ఇంటికి వస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంటి కొనుగోలు కొరకు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నా పనులన్నింటినీ పూర్తిచేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతురత మీ వైవాహిక తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

సింహరాశి : ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆఫీసులో మీ పని సామర్థ్యం మీద అందరి ప్రశంసలు. విదేశీ వ్యాపారం చేసేవారికి లాభాలు కావాల్సినంత ధనం చేతికందుతుంది. పొదుపు చేస్తారు. మీకు అప్పగించబడిన బాధ్యతలను సక్రమంగా పూర్తిచేస్తారు. మీ పాజిటివ్ థింకింగ్ వలన మరియు మీ ఫిట్ నెస్ ప్రయత్నాల వలన మానసిక మరియు శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితం మీద ఎంతో తృప్తినిస్తుంది.

కన్య రాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్థిక విషయాలలో పురోగతి. బహుమతుల ద్వారా ధనలాభం. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు.

తులారాశి : అనారోగ్య సమస్యల నుండి దూరం అవడం వలన మనశ్శాంతి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆఫీసు పనిలో అధిక శ్రమ ఉన్నా సమయ పాలన వలన అన్ని పనులు పూర్తి చేస్తారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. ఈ రాశి స్త్రీలు మీ పిల్లల ప్రవర్తన పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి : వంశ పారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తి లభిస్తుంది. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి జీవితమంటే పోరాటం కాదు. సరైన భోజనం మరియు ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తి ఆరోగ్యాన్నిస్తాయి. వ్యాపారంలో అనుభవజ్ఞులైన వారి సలహాల వలన లాభాలు. పాత స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు అధిక శ్రమ వలన నిద్రలేమి.

ధనుస్సు రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయంతో అన్ని పనులను పూర్తిచేస్తారు. ప్రేమికులకు పెళ్లి శుభవార్త. కుటుంబ సభ్యుల కొరకు తగినంత సమయం కేటాయించండి లేకుంటే వారికి అశాంతి. కావాల్సినంత ధనం చేతికందుతుంది డబ్బు పొదుపు చేస్తారు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. అనారోగ్యం నుంచి బయట పడతారు. కళా రంగంలోని వారికి సరైన అవకాశాలు. ఈ రాశి స్త్రీలకు అనవసరపు విషయాలు మీద సమయం వృధా కావడం మీకు అశాంతి ఇస్తుంది.

మకర రాశి : ఇవ్వవలసిన అప్పు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి నుండి బలవంతంగా వసూలు చేస్తారు స్థిరాస్తి కొనుగోలుకు శుభ సూచనలు. ఫిట్ నెస్ కొరకు మిత భోజనం ఒక్కటే కాదు యోగ మెడిటేషన్ కూడా అవసరం. ఆదాయం బాగున్నా అంతే ఖర్చులు. అనవసరపు ఖర్చుల గురించి మీ పెద్దవారి నుంచి లెక్చర్ వినవలసి వస్తుంది. ఆఫీసులో పని మీద శ్రద్ధ పెట్టి పూర్తి చేయండి ఈ రాశి స్త్రీలకు కుటుంబ ప్రగతి కొరకు మీ సూచనలు అందరి మెప్పు పొందుతాయి.

కుంభరాశి : మీ ఆశావహ దృక్పథం వలన సరైన మార్గాల ద్వారా విజయం లభిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకం. కుటుంబంలో ఆహ్లదకర వాతావరణం. ఫిట్ నెస్ కొరకు సరైన ప్రయత్నాలు చేస్తారు. ప్రముఖ వ్యక్తులతో వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. కొన్ని అనవసర ఖర్చులు చేసిన తర్వాత బాధనిపిస్తాయి. పిల్లల అనారోగ్యం కొంత అశాంతి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త తన మాట నిలబెట్టుకోలేక పోవటం వలన కొంత శాంతి.

మీన రాశి : ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టండి. యోగ మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఆధ్యాత్మిక సాధన కూడా ఒక మంచి ఉపాయం. ఆఫీసులో పనిలో సహనం కోల్పోవటం కన్నా సరైన ప్రణాళిక ద్వారా పనులు పూర్తవుతాయి. మీ నిర్లక్ష్య ధోరణి ఇంటిలో పెద్ద వారిని బాధ పెట్టొచ్చు. మీ గౌరవాన్ని వాడుకుందాం అనుకునే వ్యక్తులను దూరం పెట్టండి ఈ రాశి స్త్రీలకు ఎన్నో రోజుల తర్వాత మీ భర్త ప్రవర్తన మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.