ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మతతత్వ పార్టీని ఓడించాలి : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 11 |
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మతతత్వ పార్టీని ఓడించాలి : వంశీచంద్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సందర్భంగా భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కోసం మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించే దిశగా ఒక్కటై కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన సిపిఎం జిల్లా నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో బీజేపీ కుల, మత, వర్గాల పేరుతో విచ్ఛిన్నం చేస్తున్న ఈ సమయంలో ఇండియా కూటమిని గెలిపించిచే దిశగా ప్రతి ఒక్కరూ కదలిరావాలని, పాలమూరు అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజా పాలనకు మద్ధత్తుగా తనను ఎంపీగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ, కిల్లె గోపాల్ మాట్లాడుతూ… సెక్యులరిజం భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ గెలుపు అవశ్యకతను వివరించారు. దేశానికి ప్రమాదకరమైన బీజేపీని ఓడించాల్సిన అవసరం ఎంతుందో, మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు కూడా అంతే అవసరమని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాములు, వెంకట్రాములు, జబ్బార్, కురుమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.



Next Story