కుళ్లిపోయిన కూరగాయలతో భోజనాలు పెడుతున్నారంటూ విద్యార్థుల ధర్నా

by Disha Web Desk 15 |
కుళ్లిపోయిన కూరగాయలతో భోజనాలు పెడుతున్నారంటూ విద్యార్థుల ధర్నా
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో ఉన్న ఎస్సీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించలేకపోవడంతో పాటు కుళ్లిపోయిన, మురిగిపోయిన కూరగాయలతో వంట చేస్తూ తమ ఆరోగ్యాలతో చలగాటం ఆడుతున్నారని హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నప్పటికీ అధికారులు, హాస్టల్ వార్డెన్లలో మాత్రం ఏమాత్రం చలనం రావడం లేదని, పైగా ఇష్టముంటే తినండి లేకపోతే బయటకు వెళ్లి తినండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారని

విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో హాస్టల్ విద్యార్థులు వినూత్నంగా మురిగిపోయిన కూరగాయలతో నిరసన చేపట్టారు. గంట వరకు విద్యార్థులు ధర్నా చౌక్ లోనే బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులకు, హాస్టల్ విద్యార్థులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఇదే హాస్టల్​ని స్థానిక ఎమ్మెల్యే సందర్శించి సమస్యలు తెలుసుకొని అధికారుల్లో మార్పు రావాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం.



Next Story