ఈ రాశి వారికి సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు

by  |
ఈ రాశి వారికి సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 58 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 31 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష (నిన్న ఉదయం 10 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 17 ని॥ వరకు)
యోగము : శోభనము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 50 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 28 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 9 ని॥ నుంచి 4 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ నుంచి 9 గం॥ 19 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 17 ని॥ నుంచి 11 గం॥ 8 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 36 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 13 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం12 గం॥ 22 ని॥ నుంచి 1 గం॥ 59 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి 10 గం॥ 44 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 53 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : కుంభము
విశేషం : 27. సంకష్టహరచతుర్థి

మేష రాశి : మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న కార్యాలను సాధిస్తారు. సరైన ఆలోచనలతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పాతబాకీలు వసూలవుతాయి. ఈరోజు ఆఫీసులో ఆహ్లాదకర వాతావరణం. మీ పని నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. ఉద్యోగం మార్పుకై ప్రయత్నాలు చేస్తున్న వారు తొందరపడకండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడుపుతారు.

వృషభ రాశి : సంఘంలో పేరుప్రతిష్టలు. అదృష్టం వలన మంచి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటివరకు పడిన టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు భారీగా ఖర్చు పెట్టడం వలన డబ్బుకు ఇబ్బంది. అనుమానం వలన బాంధవ్యాలు దెబ్బతింటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మిధున రాశి : ఈరోజు మీరు ఆనందంగా ఉంటారు ఇతరులను సంతోష పరుస్తారు. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి ఇంటి పనులు చేయటం వలన మీకు ఎంతో ఆనందం. ఇతరులతో పరుషంగా మాట్లాడకండి. దానివలన లేనిపోని ఇబ్బందులు. ఆఫీసు పనులను శ్రద్ధతో సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ.మీ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానెయ్యండి ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నించండి.

కర్కాటక రాశి : సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆఫీసు పనిలో మీ నిబద్ధత పై అందరి ప్రశంసలు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. ఈరోజు ముఖ్యంగా ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒక శుభవార్త ఇంట్లోని కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైభవంగా మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తారు.

సింహరాశి : ఈరోజు చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆర్థికపరమైన విషయాలలో గందరగోళంలోకి వెళ్ళకండి. ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. దుబారా అనవసరపు ఖర్చులను నివారించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు మీ పెద్ద వారి దీవెనలను అందుకోండి. ఆఫీసులో ఎవరితోటి వాదోపవాదాలకు దిగకండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో వారి శ్రమకు తగిన ఫలితం. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

కన్య రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి వాటి వలన భవిష్యత్తులో లాభాలు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి వారితో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి గాలిలో మేడలు కట్టకండి. ఆడంబరాలకు ఖర్చు పెట్టడం వల్ల డబ్బుకు ఇబ్బంది అని ఈరోజు తెలుసుకుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

తులారాశి : ఈరోజు అన్ని పనులలో ఆటంకాలు ఉండవచ్చు ధైర్యం కోల్పోకండి సహనం వహించండి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే మీ మనస్తత్వం వలన కొన్ని లాభాలు కొన్ని నష్టాలు. కొంతమందికి వారి పిల్లల నుంచి ధన సహాయం లభిస్తుంది. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి. ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క మొరటు ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది వారికి అర్థం అయ్యేటట్టు చెప్పండి.

వృశ్చిక రాశి : మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీ తెలివితేటలను ఉపయోగించండి. ఆఫీసు పనుల పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసుకు ప్రతిరోజు ఆలస్యంగా వెళ్లటం వలన మరియు పనులను పెండింగ్ పెట్టడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం వలన మీ వైవాహిక జీవితం మాధుర్యాన్ని అనుభవించలేక పోతున్నారు. మారటానికి ప్రయత్నించండి.

ధనుస్సు రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాల వలన భవిష్యత్తులో లాభాలు. కొంతమంది హాలిడే ట్రిప్ వేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. వ్యాపారులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి వారితో పరుషంగా మాట్లాడకండి. ఆఫీస్ పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్టు ఇవ్వబోతున్నారు ఆనందించండి.

మకర రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొన్ని పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోవద్దు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్థిక సమస్యల వలన మానసిక అశాంతి. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆఫీసు పనిలో మీ నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఎంత విలువ ఇస్తున్నారో తెలుసుకొని ఆనందిస్తారు.

కుంభరాశి : సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు శుభవార్తలు లభిస్తాయి. రవాణా వ్యాపారం చేసే వ్యాపారులకు లాభాలు. కొన్ని పనులను సాధించడానికి కష్టపడాల్సి వస్తే కొన్ని సుఖాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు షాపింగ్ చేస్తారు. ఆదాయం బాగున్నప్పటికీ అనవసరపు ఖర్చు ల వలన డబ్బు ఇబ్బంది కాబట్టి దుబారా ఖర్చును నివారించండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు. వారిని ఒక కంట గమనించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

మీన రాశి : ఈరోజు మీ ఆత్మవిశ్వాసం అంబరాన్ని అంటుతుంది. ఆదాయం పర్వాలేదు అనవసర ఖర్చులను నివారించండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు దానధర్మాలు చేస్తారు ఇతరులకు సహాయ పడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త కుటుంబ సభ్యులని ఆనందంలో ముంచెత్తుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.



Next Story