ఈ కలెక్టర్ మాకు వద్దంటే వద్దు.. మా ఉద్యోగాలను వారికి దోచిస్తున్నడు

by Shyam |   (  Updated:2021-10-19 08:19:20  IST  )

<p>దిశ, మంగపేట : ఆదివాసీ గిరిజనులకు వ్యతిరేకంగా పని చేస్తున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాకు వద్దంటే వద్దని ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగారు. ఆదివాసీ గిరిజన సంఘాల పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ మాకొద్దంటూ ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఆదివాసీ గిరిజన సంఘాలు మంగళవారం కమలాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశాయి. తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలెం నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆదివాసీ విద్యార్థి సంఘం [&hellip;]</p>

ఈ కలెక్టర్ మాకు వద్దంటే వద్దు.. మా ఉద్యోగాలను వారికి దోచిస్తున్నడు
X

దిశ, మంగపేట : ఆదివాసీ గిరిజనులకు వ్యతిరేకంగా పని చేస్తున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాకు వద్దంటే వద్దని ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగారు. ఆదివాసీ గిరిజన సంఘాల పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ మాకొద్దంటూ ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఆదివాసీ గిరిజన సంఘాలు మంగళవారం కమలాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశాయి. తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలెం నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కబ్బక లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. ములుగు జిల్లా కలెక్టర్ పూర్తిగా 5వ షెడ్యూల్ ప్రాంత జీఓలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ ప్రాంతానికి చెందిన ఉద్యోగాల్లో నాన్ ట్రైబల్స్‌లను నియమించడానికి కొత్త రాజ్యాంగం తయారు చేస్తున్నాడని ఆరోపించారు.

వైద్యశాఖ ఉద్యోగాలను జీఓ 68 ప్రకారం షెడ్యూల్ ట్రైబల్‌తో భర్తీ చేయాల్సి ఉండగా, అట్టి ఉద్యోగాలను రాజకీయ నాయకుల లాగా వ్యవహారిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. వైద్యశాఖ ఉద్యోగ నియామకాల్లో లక్షల రూపాయల ముడుపులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ అవినీతిపై సీబీసీఐడీతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌ను బర్తరఫ్ చేసేవరకు తుడుందెబ్బ నిద్రపోదని కబ్బాక లక్ష్మణ్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి నేతలు కొమరం రవి, గట్టిపల్లి అర్జున్‌లు పాల్గొన్నారు.

Next Story