పెళ్లి కొడుకు అయిన ‘టక్ జగదీష్’.. డేట్ ఫిక్స్

60

దిశ, వెబ్‌డెస్క్ : నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రితూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు కాగా, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నానిని పెళ్లి కొడుకును చేస్తున్న పిక్‌ను షేర్ చేసిన మూవీ యూనిట్ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. కాగా నాజర్, జగపతి బాబు, రావు రమేష్, నరేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. కాగా ‘నిన్ను కోరి’ తర్వాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే.