టైంస్లాట్ టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబర్ 30వరకు సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది. సెప్టెంబర్ 6నుంచి ఇది అమల్లోకి రానుంది. పెరటాసి నెల కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్‌లో తనిఖీల అనంతరం అనుమతిస్తారని, భక్తులు ఈ మార్పును [&hellip;]</p>

టైంస్లాట్ టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబర్ 30వరకు సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది. సెప్టెంబర్ 6నుంచి ఇది అమల్లోకి రానుంది. పెరటాసి నెల కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్‌లో తనిఖీల అనంతరం అనుమతిస్తారని, భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.

Next Story