- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సజ్జనార్ సార్ మా ఊరికి బస్సుల్లేవ్.. స్పందించిన RTC ఎండీ..
<p>దిశ, మంచిర్యాల: కరీంనగర్ నుండి మంచిర్యాలకు లక్షెట్టిపేట మీదుగా రాత్రి పదిన్నర తర్వాత బస్సు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను చెప్తూ టీఆర్ఎస్వీ యువ నాయకులు తోట పవన్ వర్మ చేసిన ట్వీట్‌కు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. కరీంనగర్ నుంచి మంచిర్యాల మధ్య నడుస్తున్న ఆర్టీసీ బస్సు లక్షేట్టిపేట్‌కు రాత్రి 10. 30 గంటలకు చేరుకుంటుందని ఆయన ట్విట్టర్ ద్వారా ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బస్సు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని […]</p>

దిశ, మంచిర్యాల: కరీంనగర్ నుండి మంచిర్యాలకు లక్షెట్టిపేట మీదుగా రాత్రి పదిన్నర తర్వాత బస్సు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను చెప్తూ టీఆర్ఎస్వీ యువ నాయకులు తోట పవన్ వర్మ చేసిన ట్వీట్‌కు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. కరీంనగర్ నుంచి మంచిర్యాల మధ్య నడుస్తున్న ఆర్టీసీ బస్సు లక్షేట్టిపేట్‌కు రాత్రి 10. 30 గంటలకు చేరుకుంటుందని ఆయన ట్విట్టర్ ద్వారా ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బస్సు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే కరీంనగర్ డిపో అధికారి పద్మావతి దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ నంబర్‌తో సహా సూచించారు. వెంటనే సంబంధిత అధికారిని సంప్రదించగా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు పవన్ వర్మ తెలిపారు. తన ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్
స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.






