సిద్దిపేట మొదటి స్థానంలో దూసుకుపోతుంది : కేటీఆర్

by  |
సిద్దిపేట మొదటి స్థానంలో దూసుకుపోతుంది : కేటీఆర్
X

దిశ, మెదక్: అభివృద్ధిలో సిద్దిపేట దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో సిద్దిపేట మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలోనే సిద్దిపేట నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. అభివృద్ధికి కృషి చేస్తున్న అందరినీ ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, సతీష్ బాబు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రాజనర్సులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed