స్వీయ నియంత్రణ తప్పనిసరి : చీఫ్ విప్ వినయ్ భాస్కర్

by  |
స్వీయ నియంత్రణ తప్పనిసరి : చీఫ్ విప్ వినయ్ భాస్కర్
X

దిశ, వరంగల్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రజలకు సూచించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలో రోడ్లపై తిరుగుతున్న ప్రజలకు పలు సూచనలు చేశారు. మరో పది రోజుల్లో వైరస్ వ్యాప్తిపై క్లారిటీ వస్తుందని ప్రజలు విచ్చలవిడిగా రోడ్ల పై తిరగకుండా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలన్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులను ప్రభుత్వంతో చర్చించి సొంత ఊళ్లకు రప్పించే ప్రక్రియపై చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు సరిపడా రైతుబజార్లు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది గుంపులు గంపులుగా వెళ్లొద్దన్నారు. వ్యాపారులు ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌర సమాజానికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరూ వ్యవహరించవద్దన్నారు. కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వద్దని, వ్యాధి సోకితే ఆపలేమన్నారు. ప్రతిపౌరుడు సామాజిక బాధ్యతతో మెలగాలని ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ముగిసేంత వరకు ఇంట్లోనే ఉండి బయటికి రావద్దని మరోసారి స్పష్టంచేశారు.

tags : corona, ts govt restrictions follow most, people, lockdown, students


Next Story

Most Viewed