మూడు రోజులుగా కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా..ఈటల

by Sridhar Babu |

<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా విషయంలో ఉత్కంఠ నెలకొంది. తాజాగా మంత్రి ఈటల.. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కుట్ర చేస్తున్నవారెవరో త్వరలోనే బయటపడుతుందని అన్నారు. రూ. 100 కోట్లు పోయినా సరే.. ఈటల రాజేందర్ భయపడడు అని హెచ్చరించారు. నా వివరణ తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం బాధాకరం అని అన్నారు. మూడు [&hellip;]</p>

మూడు రోజులుగా కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా..ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా విషయంలో ఉత్కంఠ నెలకొంది. తాజాగా మంత్రి ఈటల.. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కుట్ర చేస్తున్నవారెవరో త్వరలోనే బయటపడుతుందని అన్నారు.

రూ. 100 కోట్లు పోయినా సరే.. ఈటల రాజేందర్ భయపడడు అని హెచ్చరించారు. నా వివరణ తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం బాధాకరం అని అన్నారు. మూడు రోజులుగా కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకడం వల్ల ఆయనను కలవలేకపోయినట్టు తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు, అభిమానులు తొందరపడవద్దని కోరారు. అందరూ సంయమనం పాటించాలని అన్నారు.

Next Story