- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్షోభం దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ
<p>అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 పంజా విసిరింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పరుగులు పెడుగుతోంది. రంగంలోకి దిగిన ట్రంప్ సర్కార్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ చర్యకు వైట్‌హౌస్, సెనేట్ ప్రతినిధుల బృందం కూడా మద్దతు తెలిపింది. ఈ ప్యాకేజీ వల్ల అమెరికాలోని వ్యాపారవేత్తలు, కార్మికులు, వైద్యసిబ్బంది ప్రతి ఒక్కరూ లబ్ధి పొందనున్నారు. ఇందులో 500 […]</p>

అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 పంజా విసిరింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పరుగులు పెడుగుతోంది. రంగంలోకి దిగిన ట్రంప్ సర్కార్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ చర్యకు వైట్‌హౌస్, సెనేట్ ప్రతినిధుల బృందం కూడా మద్దతు తెలిపింది. ఈ ప్యాకేజీ వల్ల అమెరికాలోని వ్యాపారవేత్తలు, కార్మికులు, వైద్యసిబ్బంది ప్రతి ఒక్కరూ లబ్ధి పొందనున్నారు. ఇందులో 500 బిలియన్ డాలర్లను పరిశ్రమల కోసం కేటాయించనుంది. అమెరికాలోని ప్రతి ఒక్కరి ఖాతాలో సుమారు 1200 డాలర్లు (రూ.91 వేలు) జమ కానున్నాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికీ 500 డాలర్లు (సుమారు రూ.38వేలు) ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. ఆధునిక అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీ అని నిపుణులు పేర్కొంటున్నారు.
tags : us economic downfall, corona effect, trump sarkar take financial support,






